
విద్యుదుత్పత్తిపై ముందస్తు ప్రణాళిక ఉండాలి
పాల్వంచ: విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని టీజీ జెన్‌కో డైరెక్టర్(థర్మల్) వై.రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.లక్ష్మణ్, జనరేషన్ సీఈ పి.రత్నాకర్‌తో కలిసి కోల్ ప్లాంట్, వ్యాగన్ టిప్లర్, బీఓబీఆర్‌లో పర్యటించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. వర్షాకాలంలో విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, విద్యుత్ సంస్థల్లో ఇంజనీర్లకు బదిలీ పాలసీ రూపొందించాలని పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ల నాయకులు డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మయ్యకు వినతిపత్రం అందించారు. ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులు భర్తీ చేయాలని, కేటీపీఎస్‌లో నూతన కర్మాగారం, క్వార్టర్లు నిర్మించాలని, పింఛన్ పాలసీ అమలు చేయడంతో పాటు పీఎల్‌ఎఫ్ పాలసీ అలవెన్స్ మంజూరు చేయాలని నాయకులు ఉమామహేశ్వరరావు, సంపత్, రాజేష్, రాజబాబు, చంద్రకళాధర్, అరుణ్, నరేందర్, రామారావు, కృష్ణ, అక్బర్, వెంకట్రావు తదితరులు కోరారు.
జెన్‌కో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి