
అథ్లెటిక్స్‌లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ కె.మహీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి 20 మంది పాల్గొన్నారు. వారిలో కొత్తగూడేనికి చెందిన సీహెచ్ కృతిక కిడ్స్ జావెలిన్ త్రోలో రజత పతకం, కిన్నెరసానికి చెందిన డి.లోకేష్ ట్రయలాన్‌లో రజత పతకం, కాచనపల్లికి చెందిన వై.శృతిహాసన్ ట్రయలాన్‌లో రజత పతకం, భద్రాచలానికి చెందిన వి.సంజనశ్రీ 60 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకం, కిన్నెరసానికి చెందిన కె.దిలీప్ ట్రయలాన్‌లో కాంస్య పతకం సాధించారు. విజేతలను జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, కోచ్‌లు, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
హైడ్రోజన్ పెరాకై ్సడ్ తాగిన బాలుడు..
● తల్లిదండ్రుల అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
కరకగూడెం: మండలంలో ఇటీవల థమ్సప్ బాటిల్‌లో నిల్వ ఉంచిన గడ్డిమందును తాగి ఒక బాలు డు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మరవకముందే అలాంటిదే మరో ఘటన స్థాని కంగా కలకలం రేపింది. అయితే ఈసారి తల్లిదండ్రుల సకాలంలో స్పందించడంతో ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన మూడేళ్ల బాలుడు ఆదివారం ఉదయం ఆడుకుంటూ గ్రా మంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఖాళీ స్ప్రైట్ బాటిల్‌లో నిల్వ ఉంచిన హైడ్రోజన్ పెరాకై ్సడ్ ద్రావణాన్ని చూసి మంచినీళ్లు అనుకుని తాగేసి ఇంటికి వచ్చాడు. ఆతర్వాత కొద్దిక్షణాల్లోనే బాలుడు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయి వాంతులు, విరేచనాలు చేసుకుంటూ స్పృ హ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంకటే మణుగూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించడంతోవారంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండడంపై వైద్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు విషపూరిత పదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచాలని, ముఖ్యంగా మంచి నీళ్లు లేదా కూల్‌డ్రింక్స్ బాటిళ్లలో రసాయనాలను నిల్వ చేయొద్దని స్పష్టం చేస్తున్నారు.
‘అబద్ధాలతోనే
రేవంత్ పాలన’
ఖమ్మంరూరల్: అబద్ధాలు చెబుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎదులాపురం సాయిగణేశ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, బీఆర్‌ఎస్ అంటే భరోసా అని, కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టటమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులు ఎగ్గొట్టారని, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్‌లో అర్ధరాత్రి వరకు నిలడబడాల్సి వస్తోందని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ విసిరిన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని సూచించారు. సమావేశంలో బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, జర్పుల లక్ష్మణ్‌నాయక్, కోటి సైదారెడ్డి, ఉదయ్, సొడేపొంగు ప్రశాంత్, మాదాసు ఆదాం తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో
ఉద్యోగాలు లేవు..
ఖమ్మంమయూరిసెంటర్: ఏటా రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ పాలనలో రిటైర్మెంట్‌లు తప్ప రిక్రూట్‌మెంట్‌లు లేవని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు విమర్శించారు. సీపీఐ ఖమ్మం నగర 5వ మహాసభ ఆదివారం నగరంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించారు. సభకు ముందు నగరంలో సీపీఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. హేమంతరావు మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగం నిర్వీర్యమైందని, దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తుల చేతులో పెట్టడంలో మోదీ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందని విమర్శించారు. అలీన విధానానికి కేంద్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులకు మడుగులొత్తుతున్నారని మండిపడ్డారు. మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. అనంతరం పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడారు. సభలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేశ్, నాయకులు మహ్మద్ మౌలానా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, బీజీ క్లెమెంట్, నగర కార్యదర్శి జానీమియా, మహ్మద్ సలాం, మిడికంటి వెంకటరెడ్డి, పగడాల మల్లేశ్, మేకల శ్రీనివాసరావు, జ్వాలా నర్సింహారావు, యానాలి సాంబశివారెడ్డి, నూనె శశిధర్, ఏనుగు గాంధీ పాల్గొన్నారు.