
పీరీల పండగకు వేళాయే ు..
● త్యాగానికి ప్రతీకగా మొహర్రం ● పండుగకు ముస్తాబైన పీరీలు ● కులమతాలకతీతంగా భక్తుల పూజలు
నేడు పీరీల పండుగ
కొత్తగూడెంటౌన్: న్యాయం, ధర్మం, సత్యం వంటి మానవీయ విలువలతో ప్రజాస్వామ్య పరిరక్షణకు యుద్ధం చేసిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్, ఇమామ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకంగా జరుపుకునే పండగ మొహర్రం. ఈ పండగలో భాగంగా కులమతాలకు అతీతంగా పీర్ల పండుగను జరుపుకుంటారు. పండుగ నాడు భక్తులంతా పీరీలను వీధుల్లో ఊరేగిస్తుండగా.. భక్తులు కొబ్బరికాయలు, ఊద్‌లుతో మొక్కులు తీర్చుకుంటారు.
పీరీల ముస్తాబు..
పీర్ల పండుగను జరుపుకునేందుకు ఆదివారం ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇందుకు అషుర్‌ఖానాల్లోని పీర్లను ముస్తాబు చేసి పీరీలకొట్టంలో మానిక్‌లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 76కు పైగా అషూర్‌ఖానాలు ఉండగా.. కొత్తగూడెం సూపర్‌బజార్, రామవరంలోని మార్కెట్ ఏరియాలలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పీర్ల పంజా(పీర్ల దేవుళ్ల ప్రతిమ)లను కూర్చోబెట్టి అమరవీరులను, పెద్దలను స్మరిస్తూ ఎర్రగా మండే నిప్పు కణికల్లో నడిచి తమ భక్తిని చాటుతారు.
తెల్లవారుజాము నుంచే సందడి
తెల్లవారు జామున పీరీలతో వీధుల్లోని ఇంటింటికి ఊరేగింపుగా తీసుకెళ్లగా.. భక్తులు కులమతాలకు అతీతంగా మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. తిరిగి పండుగ రోజు సాయంకాలం వీటిని మార్కెట్లలో ఏర్పాటు చేయగా.. అందరూ అక్కడకు చేరుకుని ఆడిపాడి సందడి చేస్తారు. ఇందుకు దర్గాల్లో పీరీలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఇస్లాం నూతన సంవత్సరం..
మహ్మద్‌ప్రవక్త మనవడు ఇమా మ్ హుస్సేన్ వారి మనవడు సహచరుల ప్రాణత్యాగాలకు ప్రతీకగా మొహర్రంను జరుపుకుంటారు. కులమతా లకు అతీతంగా షరబత్ పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను చేస్తారు. ఇది అన్ని వర్గాలకు ఇష్టమైన పండుగ.
– యాకుబ్‌పాషా, నూరియా హనఫీయా ఎడ్యుకేషనల్ సొసైటీ, పాల్వంచ
త్యాగానికి గుర్తు..
త్యాగాలకు గుర్తుగా మొహర్రం పండుగను జరుపుకుంటాం. పీర్లను ఊరేగింపుగా తీసుకొచ్చి భక్తులకు ఆశీర్వచనాలు, ఊద్‌లాంటివి అంది స్తాం. ఇస్లాంకు మూలమైన మానవతావాదానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. వీరత్వం నుంచి స్ఫూర్తి పొందిన పండగా..అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారు. – బాబా, అసూర్‌ఖానా
నిర్వాహకుడు, వేణుగోపాల్‌నగర్‌కాలనీ, రామవరం

పీరీల పండగకు వేళాయే ు..

పీరీల పండగకు వేళాయే ు..