
జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
ఇల్లెందు: విత్తనాలు సేకరించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థులకు చాలెంజ్ విసరడంతో మండలంలోని ముత్తారపు కట్ట ఎంపీపీఎస్ స్కూల్ విద్యార్థులు 120 రకాల విత్తనాలు సేకరించి మండల స్థాయి విజేతలుగా నిలిచారు. శనివారం ఇల్లెందు మండలస్థాయి విత్తన సేకరణ చాలెంజ్ ప్రదర్శన పట్టణంలోని జేబీఎస్ హైస్కూల్‌లో నిర్వహించారు. శుక్రవారం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో జరిగిన పోటీల్లో గర్‌ల్స్ హైస్కూల్, జేబీఎస్, 21 ఫిట్ జెడ్పీ హైస్కూల్, మొయిన్ రోడ్ హైస్కూల్, చల్లసముద్రం, కొమరారం, సుభాష్‌నగర్‌ల పరిధి నుంచి ఒక్కో స్కూల్ నుంచి పోటీల్లో పాల్గొనగా.. ముత్తారపు కట్ట ఎంపీపీఎస్ జిల్లాస్థాయికి ఎంపికై నట్లు ఎంఈఓ ఉమాశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ హెచ్‌ఎం కబ్బాకుల రవి, టీచర్ ఆరెం రవికుమార్‌లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎంలు లలిత, అరుణ్‌కుమార్, లాలు, కల్పన, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.