ప్రైవేట్‌ మందులే దిక్కు.. | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ మందులే దిక్కు..

Jul 5 2025 6:20 AM | Updated on Jul 5 2025 6:20 AM

ప్రైవ

ప్రైవేట్‌ మందులే దిక్కు..

● పల్లెల్లో కానరాని పశువైద్యం ● మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ● ఏడు నెలలుగా నిలిచిన సరఫరా ● ప్రైవేట్‌లో మందులు కొంటేనే పశువులకు వైద్యం

బూర్గంపాడు: జిల్లాలో పశువైద్యం ప్రైవేట్‌లో మందులు కొంటేనే సాధ్యపడుతోంది. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలోని పశు వైద్యశాలలకు ఏడునెలలుగా మందుల సరఫరా నిలిచిపోయింది. గత నవంబర్‌లో వచ్చిన మందులే తప్ప ఇంతవరకు సరఫరా జరగలేదు. పశువులకు ఏదైనా రోగమొచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి గాయపడినా పశు వైద్యశాలల్లో మందులు లేవు. దీంతో పశువుల పెంపకందారులు ప్రైవేట్‌ మందుల దుకాణాల్లో మందులు కొనుక్కుంటేనే వైద్యం అందించే పరిస్థితులున్నాయి. పశు వైద్యశాలల్లో మందుల కొరతతో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్న ఘటనలు ఎదురవుతున్నాయి. కనీసం నట్ట ల నివారణ మందులు కూడా పశు వైద్యశాలల్లో లేవంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

రెండేళ్లుగా నట్టల మందులు కరువు..

జిల్లాలో 2.12లక్షల గేదెలు, ఆవులు ఉన్నాయి. సుమారు 3.25లక్షల మేకలు, గొర్రెలున్నాయి. ఇవి కాకుండా పందులు, పెంపుడు కుక్కలు కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. పశువులకు, జీవాలకు వైద్యసేవలు అందించేందుకు జిల్లాలో 80 ప్రభుత్వ పశువైద్యశాలలున్నాయి. పశువులకు వైద్యం చేసేందుకు డాక్టర్లు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నా రు. అయితే పశువుల ఆస్పత్రులకు మందుల కొర త తరచుగా వేధిస్తోంది. వర్షాకాలం పశువులు, జీవాలలో కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి. సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ తరుణంలోనే పశువులకు, జీవాలకు ప్రభుత్వపరంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని పశువైద్యశాలల్లో యాంటీ బయాటిక్స్‌ కొరత ఎక్కువగా ఉంది. వ్యాధుల నివారణకు యాంటీ బయాటిక్స్‌తో పాటుగా బలానికి ఇచ్చే సపోర్టింగ్‌ మందులు (విటమిన్‌, మినరల్స్‌) కూడా అందుబాటులో లేవు. అనారోగ్యంతో ఆస్పత్రులకు తీసుకువచ్చిన పశువులకు తక్షణ శక్తి కోసం ఇచ్చే సెలెన్‌ బాటిళ్లు కూడా లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. మేకలు, గొర్రెలకు మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందులు వేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లుగా నట్టల నివారణ మందుల సరఫరా లేకపోవటంతో జీవాల పెంపకందారులు ప్రైవేట్‌ దుకాణా ల్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కనీసం నట్టల నివారణ మందులు కూడా లేకపోవటం ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. వైద్యం కోసం పశువుల పెంపకందారులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే మందుల చీటీ రాయించుకుని ప్రైవేట్‌ దుకాణాల్లో డబ్బులు పెట్టి కొనుక్కుంటేనే వైద్యం చేసే పరిస్థితులున్నాయి.

ప్రైవేట్‌ మందులే దిక్కు.. 1
1/1

ప్రైవేట్‌ మందులే దిక్కు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement