900 గ్రాముల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

900 గ్రాముల గంజాయి స్వాధీనం

Jul 5 2025 6:20 AM | Updated on Jul 5 2025 6:20 AM

900 గ

900 గ్రాముల గంజాయి స్వాధీనం

ఖమ్మంక్రైం: ఖమ్మంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న 900 గ్రాముల గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎస్‌ఐ సంధ్య ఆధ్వర్యాన తనిఖీలు చేస్తుండగా.. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్‌ మోహిత్‌ గంజాయి అమ్ముతూ కొత్త బస్టాండ్‌ సమీపంలోని గుట్టపై పట్టుబడ్డాడు. ఆయన నుంచి రూ.30 వేల విలువైన 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడమే కాక కొనుగోలుకు వచ్చిన గోపాలపురం, జహీర్‌పురవాసులు బాదావత్‌ ప్రవీణ్‌, దూర్‌ సందీప్‌, దోన్‌వాన్‌ సాయివినయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక సీజ్‌

పాల్వంచ: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు. పట్టణ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన లారీ ఇసుకను రెవెన్యూ ఆర్‌ఐ రవికుమార్‌ సీజ్‌ చేశారు. అనంతరం ఇసుకను తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు.

కాంట్రాక్టర్స్‌కాలనీలో చోరీ?

పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్‌కాలనీలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగినట్లు సమాచారం. స్థానికుల కథనం మేరకు.. ఓ మహిళ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకెళ్లినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై ఎస్‌ఐ సుమన్‌ను వివరణ కోరగా.. ఘటనపై విచారిస్తున్నామని తెలిపారు.

ఒక్కటే గుక్క..

ఊపిరి తీసింది..

కరకగూడెం: శీతలపానియం సీసా కనిపిస్తే తీసుకుని ఒక్క గుక్క వేశాడు.. అంతే అదే ఆ బాలుడి ప్రాణాలు బలికొంది. అందులో ఉన్నది పురుగులమందు అని తెలియక తాగిన బాలుడు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి తనువుచాలించాడు. మండలంలోని చొప్పల గ్రామానికి చెందిన జాడి నవీన్‌, వరలక్ష్మి దంపతుల రెండో సంతానం వరుణ్‌ తేజ (5) గత నెల 29న ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో తన తండ్రి గ్రామంలో ఓ వ్యక్తి అడిగాడని ఖాళీ శీతలపానియం సీసాలో గడ్డిమందు పోసి ఇంటి ముందు పెట్టి ఊర్లోకి వెళ్లాడు. అది చూసిన వరుణ్‌ తేజ తాగాడు. కొన్ని క్షణాల్లోనే తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. పలువురు దాతలు కూడా ఆర్థిక సాయం చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి వరుణ్‌ తేజ తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

మృత్యువుతో పోరాడి ఓడిన బాలుడు వరుణ్‌ తేజ

900 గ్రాముల గంజాయి స్వాధీనం 1
1/1

900 గ్రాముల గంజాయి స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement