
భవనం.. భయానకం
● భద్రాచలంలో ప్రమాదకరంగా 131 శిథిల భవనాలు ● వాటి తొలగింపుపై మీనమేషాలు ● ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి ● నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో శిథిల భవనాలు ప్రాణసంకటంలా పరిణమిస్తున్నాయి. అవి ఎప్పుడూ కూలుతాయో తెలియదు. వాటిని గుర్తించి కూల్చివేస్తే పెనుముప్పును తప్పించినట్లే. భారీ వర్షాలు కురిసే ముందే కార్యాచరణకు దిగాల్సిన అవసరం ఉంది. ఇటీవల భద్రాచలంలో వరుసగా కురిసిన వర్షాలకు గోడలు నాని ఉంటా యి. ఈ క్రమంలో వర్షాలు అధికంగా కురిసి, భవనా లు కూలితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చోటుచేసుకోకముందే భద్రాచలం గ్రామ పంచాయతీ అధికారులు కఠినంగా వ్య వహరించాల్సి ఉంది. ఈ ఏడాది రెండు నెలల వర కు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాత భవనాలు నాని కూలే అవకాశం ఉంది. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికారులు అలాంటి భవనాలపై నిఘా ఉంచి, పట్టణంలో ఉన్న శిథిల భవానలను నేలమట్టం చేయాలి.
అడ్డగోలుగా నిర్మాణాలు..
భద్రాచలం పట్టణంలోని గ్రామ పంచాయతీ పరిధి లో భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే, ఆయా నిర్మాణాలకు అనుమతు లు ఉన్నాయా? లేవా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకటి, రెండు అంతస్తులకు అనుమతు లు తీసుకుంటున్న యజమానులు నాలుగు నుంచి ఐదు అంతస్తులను నిర్మిస్తున్నారు. ఇక బిల్డర్లు ఏ మేరకు నాణ్యత పాటిస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. లాభాల కోసం భవనాలను నిబంధన లకు విరుద్ధంగా నిర్మిస్తున్నారనే విమర్శలున్నా యి. ఇటీవల భద్రాచలం నిబంధనలకు విరుద్ధంగా జీ+1కు అనుమతి తీసుకుని జీ+3, జీ+4, జీ+5 అంతస్తులకు స్లాబ్ వేసినవి 130 భవనాలు ఉన్నా యి. వీటిలో కేవలం 15 మంది యజమానులకే నోటీసులు జారీ చేసి వారి నుంచి భారీగా జరిమానాలు వసూలు చేశారు.
23 భవనాలకు నోటీసులు..
భద్రాచలం పట్టణంలో 23 శిథిలావస్థ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. అందులో 5 ఇళ్లు ఇటీవల దేవస్థానం అభివృద్ధిలో భాగంగా తొలగించినట్లుగా సమాచారం. మరో 18 భవనాలు అలాగే ఉన్నాయి. పూర్తిగా శిథిలమైన భవనాలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమ ర్శలున్నాయి. ఇవే కాకుండా భద్రాచలం పట్టణంలో పలు చోట్ల పాత భవనాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అధికారులు గుర్తించడం లేదనే విమర్శలున్నాయి. అలాగే, పాత భవనాలపై కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. ఓ పాత భవనంపై నిర్మాణం చేపడుతున్న క్రమంలో ఈ ఏడాది మార్చి 26న శ్రీపాద శ్రీపతికి చెందిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇద్దరు భవన నిర్మా ణ కార్మికులు శిథిలాల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్ట్ 4వ తేదీన వర్షానికి నాని తాతగుడి సెంటర్‌లో ప్రహరీ కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. పాత భవనాల పరిస్థితి ఎమిటనేది కూడా తెలుసుకోకుండా అను మతులు ఎలా ఇస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నా యి. సంబంధిత అధికారులు కూడా అనుమతులు ఇచ్చేటప్పుడు ఆయా స్థలాలను పరిస్థితిని పరిశీలించకుండా అంచనావేయడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

భవనం.. భయానకం