
‘ఉపాధి’లో నిబంధనలు పాటించాలి
చుంచుపల్లి: నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులు చేపట్టాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో ఎంపీడీఓలు, పీఆర్ ఏఈలు, ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి కూలీకి కనీస వేతనం రోజుకు రూ.300 వచ్చేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ, అంగన్ వాడీ కేంద్రాల భవనాల పనులు ప్రారంభించాలని చెప్పారు. వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పాలసీలను నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేస్–11లో జిల్లాలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు 16 మంజూరుకాగా, నాలుగింటి పనులే ప్రారంభించారని, మిగిలిన 12 పనులను మొదలు పెట్టాలని సూచించారు. డీఆర్‌డీఓ ఎం. విద్యాచందన, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, అదనపు డీఆర్‌డీఓ ఎన్. రవి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్