● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెలలో జారీ అయినవి 365 మాత్రమే ● 23,965 కార్డుల్లో మార్పులు, చేర్పులు ● జిల్లాకు అదనంగా 135 మెట్రిక్‌ టన్నుల బియ్యం | - | Sakshi
Sakshi News home page

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెలలో జారీ అయినవి 365 మాత్రమే ● 23,965 కార్డుల్లో మార్పులు, చేర్పులు ● జిల్లాకు అదనంగా 135 మెట్రిక్‌ టన్నుల బియ్యం

May 8 2025 7:53 AM | Updated on May 8 2025 7:53 AM

● కొత

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025

నేత్రపర్వంగా

రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పర్ణశాల ఆలయ

హుండీ లెక్కింపు

దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను భద్రాచలం దేవస్థానం ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో బుదవారం లెక్కించారు. 328 రోజులకు గాను రూ.19,20,061 ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు. గతేడాది జూన్‌ 13న చివరిసారిగా హుండీలు లెక్కించామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఓ భవానీ రామకృష్ణ, శ్రీనివాస్‌, ఆలయ ఇన్‌చార్జ్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల

ఊబిలో చిక్కుకోవద్దు

ఎస్పీ రోహిత్‌రాజు

కొత్తగూడెంఅర్బన్‌: సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్‌లు, పేకాట, స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ ఊబిలో చిక్కుకోవద్దని ఎస్పీ రోహిత్‌రాజు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. మొదట్లో కొద్దిపాటి లాభం రాగానే, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో కొందరు వీటికి బానిసలుగా మారారని తెలిపారు. యువత మాత్రమే కాక రిటైర్డ్‌ ఉద్యోగులు, పెద్ద వయసు వారు కూడా ఇలాంటి వాటికి అలవాటు పడుతూ ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారని, ఆ తర్వాత అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నిమిషాల్లోనే అప్పు ఇస్తామంటూ వస్తున్న లోన్‌ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు నిత్యం ఏం చేస్తున్నారు.. ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఎవరైనా ఆన్‌లైన్‌ లేదా నేరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

నిరుద్యోగులకు

ఉచిత శిక్షణ

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి పరిధిలోని నిరుద్యోగులు, ప్రభావిత, పరిసర ప్రాంతాల యువత, మాజీ, ప్రస్తుత కార్మికుల పిల్లలకు నైపుణ్యాభివృద్ధి అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం షాలేంరాజు తెలిపారు. హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సహకారంతో ఎనిమిది రకాల కోర్సుల్లో నెల రోజులు శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఒక్కో కోర్సుల్లో 30 మందికి అవకాశం ఉండగా, 18 – 28 ఏళ్ల వయస్సు వారు ఈనెల 30వ తేదీలోపు కొత్తగూడెంలోని మైన్స్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(ఎంవీటీసీ)లో అవసరమైన సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని జీఎం సూచించారు. వివరాలకు 98661 17145నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

న్యూస్‌రీల్‌

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల1
1/3

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల2
2/3

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల3
3/3

● కొత్త రేషన్‌కార్డు దరఖాస్తులు 53 వేలకు పైగానే ● ఈ నెల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement