
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.
దరఖాస్తులలో కొన్ని..
● ఒంటరి మహిళనైన తనకు ఏ ఆధారం లేదని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణం మంజూరు చేయాలని పాతపాల్వంచ శ్రీనివాసపురం కాలనీకి చెందిన ఎండీ షాకీరా బేగం దరఖాస్తు చేయగా, మైనార్టీ సంక్షేమాధికారికి ఎండార్స్ చేశారు.
● తమకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా గల 4.20 ఎకరాల భూమి ఉందని, ఇప్పటివరకు రైతుభరోసా, రుణమాఫీ మంజూరు కాలేదని పినపాక మండలం ఎల్లాపురానికి చెందిన చర్ప చినలక్ష్మి దరఖాస్తు చేయగా జిల్లా వ్యవసాయాధికారికి పంపించారు.
● తాను 20 ఏళ్లుగా అద్దె ఇంటో ఉంటున్నానని, దివ్యాంగుడినైన తనకు అద్దె చెల్లించడం భారం అవుతోందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన గండేపల్లి రామకృష్ణ అందించిన దరఖాస్తును హౌసింగ్ పీడీకి ఎండార్స్ చేశారు.
అదనపు కలెక్టర్లు వేణుగోపాల్,
విద్యాచందన