
ఐకేపీలో అక్రమాల పర్వం..
బూర్గంపాడు: మండల ఇందిరా క్రాంతి పథం సిబ్బంది అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సీసీలు, బుక్‌కీపర్‌లు అందినకాడికి డ్వాక్రా సంఘాల మహిళల సొమ్మును స్వాహా చేశారు. బూర్గంపాడు ఐకేపీలో లక్షల రూపాయ ల నిధులు స్వాహా అయినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలుతోంది. శనివారం బూర్గంపా డు గౌతమిపురంలోని గ్రామసమాఖ్యలోని 19 డ్వాక్రా సంఘాల సభ్యులు చెల్లించిన సీ్త్రనిధి రు ణాలలో ఐకేపీ సిబ్బంది చేతివాటం చూపించిన ట్లు మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ ఆరోపణలపై సీ్త్రనిధి ఆర్‌ఎం సోషల్ ఆడిట్‌కు ఆదేశించారు. ఇదిలాఉండగా జీవనజ్యోతి, వెన్నెలజ్యోతి, శబరి, శ్రీరామ, చైతన్య, టేకులచెరువు, నకిరిపేట, కృష్ణసాగర్ గ్రామ సమాఖ్యల పరిధిలోని డ్వాక్రా సంఘాల సభ్యులు చెల్లించిన నిధులను వారి రుణఖాతాల్లో జమ చేయకుండా సీసీ రాంబాబు స్వాహా చేశారని గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన సెర్ప్ అధికారులు రూ.1.92లక్షల నిధులు దుర్విని యోగమైనట్లు నిర్ధారించారు. దీనిపై సంబంధిత సీసీ రాంబాబుకు షోకాజ్ నోటీస్‌లు జారీచేశారు. డ్వాక్రా మహిళలకు ఐకేపీ, సీ్త్రనిధి నుంచి రుణా లు అందిస్తున్నారు. కాగా,రుణాలు ఇచ్చే సమయంలో కూడా ఐకేపీ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారని, సీసీకి, బుక్‌కీపర్‌కు ఒక్కో సభ్యురాలు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. సీ్త్రనిధి రుణాల మంజూరులో కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. సిబ్బంది కాజేసిన డబ్బులు రికవరీ చేసి తమ అప్పు ఖాతాల్లో జమచేయాలని డ్వాక్రా సంఘాల మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
సీ్త్రనిధి చెల్లింపుల్లో నిధులు స్వాహా
సీసీకి షోకాజ్ నోటీసులు జారీ