
ఉపాధి పనుల పరిశీలన
చండ్రుగొండ : మండలంలోని తిప్పనపల్లి, రావికంపాడు గ్రామాల్లో సోమవారం కేంద్ర బృందం సభ్యులు రాకేష్‌కుమార్, అమిత్‌కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారు పరిశీలించారు. ప్రధానంగా ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మట్టి పనులను తనిఖీ చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు సదుపాయాల కల్పన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఏర్పాటు చేయడం లేదని, పలుగు పారలు ఇవ్వడం లేదని కూలీలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మునగ పంట సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. రుణాల మంజూరు, రికవరీ ఎలా ఉన్నాయని స్వయం సహాయక సంఘాల మహిళలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట డీఆర్‌డీఓ విద్యాచందన, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ ఉన్నారు.
నేడు పాల్వంచకు..
పాల్వంచరూరల్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఈజీఎస్, ఐకేపీ శాఖలకు చెందిన అభివృద్ధి పనుల పరిశీలనకు మంగళవారం కేంద్ర బృందం సభ్యులు రాకేష్‌కుఉమార్, అమిత్‌కుమార్ పాల్వంచ మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు కిన్నెరసాని, 12 గంటలకు తోగ్గూడెం గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు.
తిప్పనపల్లి, రావికంపాడులో
కేంద్ర బృందం పర్యటన