
సౌకర్యాలు ఎలా ఉన్నాయ్..?
ఉపాధి కూలీలను ఆరా తీసీన
కేంద్ర బృందం
పాల్వంచరూరల్ : పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు కల్పిస్తున్నారా.. కూలీలకు సరాసరి ఎంత వేతనం వస్తోంది.. పనిచేశాక ఎన్ని రోజులకు వేతనం అందుతోంది అంటూ కేంద్ర బృందం సభ్యులు రాకేష్‌కుమార్, వివేక్‌కుమార్ కేసరి ఆరా తీశారు. మండలంలోని జగన్నాథపురం, ప్రభాత్‌నగర్‌లో మంగళవారం పర్యటించిన సభ్యులు.. ఉపాధి కూలీలతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగన్నాథపురంలో ఫాంపాండ్ పనులు, పామాయిల్ తోట, నర్సరీలు, ప్రభాత్‌నగర్‌లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద చేపట్టిన బ్రిడ్జి పనులను పరిశీలించారు.
కిన్నెరసాని సందర్శన..
పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. డీర్ పార్కులోని దుప్పులను చూస్తుండగా ఒక జింక కంచె వద్దకు రాగా దానికి మేత అందించారు. ఆ తర్వాత డ్యామ్ పైకెళ్లి జలాశయాన్ని వీక్షించి లొకేషన్ చాలా అందంగా ఉందంటూ కితాబిచ్చారు. స్థానిక అధికారులతో కలిసి ఫొటోలు దిగారు. బృందం వెంట డీఆర్‌డీఓ విద్యాచందన, ఎంపీడీఓ కె.విజయభాస్కర్‌రెడ్డి, ఏపీఓ రంగా, ఏపీఎం రాంబాబు, ఈసీలు రాజు, పుల్లయ్య, కార్యదర్శులు సాయిరాం, శ్రీనివాస్, శ్రీబాబు, రవి తదితరులు ఉన్నారు.