
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని..
● భద్రాచలం భగవాన్‌దాస్ కాలనీకి చెందిన సోళ్ల రత్నమ్మ.. అశ్వాపురం మండలం చింతిర్యాల పంచాయతీ పరిధిలో సర్వే నంబరు 80/3, 80/4లో 1.03 ఎకరాల భూమి తన సోదరి మరియమ్మ పేరున ఉందని, ఆమె మరణించినందున వారసుల పేరున పట్టా మార్పిడి చేయాలని దరఖాస్తు చేయగా కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.
● పాల్వంచ గాంధీనగర్‌కు చెందిన నడిగిరి మణికంఠ తాను హీమోపీలియా వ్యాధితో బాధపడుతున్నానని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో ఏ పనీ చేయలేకపోతున్నానని, దివ్యాంగ పింఛన్ కోసం సదరమ్ సర్టిఫికెట్ ఇప్పించాలని కోరగా ఆ దరఖాస్తును డీఎంహెచ్‌ఓకు ఎండార్స్ చేశారు.
● పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న పావురాల రామతులశమ్మ.. తాను రజకురాలినని, ఇసీ్త్ర చేస్తూ ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నానని, పాల్వంచ మున్సిపాలిటీ మార్కెట్ కాంప్లెక్స్‌లో ఒక గదిని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేయగా మున్సిపల్ కమిషనర్‌కు పంపించారు.
అదనపు కలెక్టర్ వేణుగోపాల్