
కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి
చండ్రుగొండ: మండలంలోని రావికంపాడు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కుక్కలదాడిలో 12 గొర్రెలు మృతి చెందిన ఘటన గురువారం వెలుగుచూసింది. రావికంపాడు గ్రామంలో ఆనంగి పెద్దపకీర్ తన గొర్రెలను ఇంటికి దూరంగా ఉన్న పాకలో ఉంచాడు. అర్ధరాత్రి వేళ కుక్కలగుంపు దాడి చేయడంతో 12 గొర్రెలు మత్యువాత పడ్డాయి. మరికొన్ని గాయాలపాలై అపస్మారకస్థితికి చేరాయి. గమనించిన బాధిత రైతు లబోదిబోమంటున్నాడు.
యువకుడి ఔదార్యం
కొత్తగూడెంఅర్బన్: ఏటీఎంలో దొరికిన డబ్బును పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించి ఓ యువకుడు ఔద్యార్యం చాటుకున్నాడు. కొత్తగూడెంలోని యాక్సిన్ బ్యాంకు ఏటీఎంలో రామవరానికి చెందిన టంగుటూరి సుదీప్‌కు రూ.50 వేలు దొరికాయి. ఆ డబ్బును సుదీప్ బ్యాంకు అధికారులకు అందించి, వారి సమక్షంలో పోగొట్టుకున్న వ్యక్తికి అందించాడు. దీంతో బ్యాంకు అధికారులు, డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి సుదీప్‌ను సన్మానించారు.

కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి