
ఏడు కిలోల గంజాయి సీజ్
భద్రాచలంటౌన్: భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా ఎకై ్సజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకుని సీజ్ చేశారు. కొత్తగూడెం టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ గౌతమ్ కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పల్సర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగుల్లో ఏడు కిలోల గంజాయి లభించింది. ద్విచక్ర వాహనంతో పాటు మొబైల్ సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని, గంజాయి విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ వెల్లడించారు. తనిఖీల్లో సిబ్బంది హబీబ్‌పాషా, వెంకటనారాయణ, గురవయ్య, శ్రావణి, పార్థసారథి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏడాది జైలు శిక్ష
భద్రాచలంటౌన్: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి భద్రాచలం ఫ్లస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. బుర్గంపాడుకు చెందిన ఆకుల లక్ష్మినారాయణరెడ్డి వద్ద కేటీపీఎస్ సీనియర్ ఇంజనీర్ సరిగొమ్ముల యుగపతి రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. అవి తీర్చేందుకు యుగపడి చెక్కు ఇవ్వగా బ్యాంకులో జమ చేస్తే తిరస్కరణకు గురైంది. దీంతో లక్ష్మీణారాయణరెడ్డి తన న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయగా.. వాదనలు విన్న న్యాయమూర్తి శివనాయక్ యుగపతికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6.50 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు.