
ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
ఇల్లెందు : నిత్యం వందలాది మంది సంచరించే చోట ఓ ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ అయి అక్కడే పార్కింగ్ చేసిన ఆటోను ఢీ కొట్టింది. ట్రాక్టర్ వేగానికి ఆటో పల్టీ కొట్టగా నుజ్జునుజ్జయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లెందులోని పాత బస్టాండ్ సమీపంలో పోలీస్‌స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్ వద్ద బ్యాంక్‌లో పని కోసం వచ్చిన వారు ఆటోను పక్కన అపారని, ఆ సమయంలో వచ్చిన ట్రాక్టర్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఆటోను ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. ఆటో డ్రైవర్ జి. భద్రు పిర్యాదు మేరకు ఇల్లెందు మండలం పోచారం తండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బానోతు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు సీఐ బత్తుల సత్యనారాయణ తెలిపారు.
23వైఎల్‌డి09:
బ్రేకులు ఫెయిల్ కావడమే కారణం