భద్రాచలంఅర్బన్: మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కథనం ప్రకారం.. గత నెల 19న పట్టణంలోని ఇందిరా మార్కెట్‌లోని కిరాణా షాపులో ఉన్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించి ఈ నెల 11న ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందుతులు పరారీలో ఉండగా గాలింపు చేపడుతున్నారు. సోమవారం పట్టణంలోని బ్రిడి్‌జ్ సెంటర్‌లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2.35 లక్షల విలువైన ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.