పాల్వంచ: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా నూతన కమిటీని బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా షేక్ గద్దర్‌బాషా, ప్రధాన కార్యదర్శిగా డప్పు జానకీరామ్, గౌరవ సలహాదారులుగా మోదుగు జోగారావు, కొండల్‌రావు, ఉపాధ్యక్షులుగా శంకర్‌నాయక్, మహిళా ప్రతినిధిగా మణుగూరు జ్యోతి, సహాయ కార్యదర్శిగా మెంతెన కొండల్‌రావు, కోశాధికారిగా షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా ఎండీ ముర్తూజ, సంయుక్త కార్యదర్శిగా కాటూరి రాము, వీర జయమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తాళ్ల మంగ, ప్రచార కార్యదర్శిగా కనకం కొమరయ్యను ఎన్నుకున్నారు. వారితో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, సుంచు లింగయ్య, పమ్మి రవి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఈశ్వర్ బహుదూర్, రమేశ్, పోలూరి రాము, సుద్దుల శ్రీను, ప్రేమ కుమారి తదితరులు పాల్గొన్నారు.