ఖమ్మం రాపర్తినగర్: అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న ఖమ్మం రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్‌లో ముఖద్వారం, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.25.41 కోట్లు కేటాయించగా ఇప్పటికే 45 శాతం మేర పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కొద్దినెలల్లో పనులు పూర్తికానుండగా స్టేషన్ కొత్తరూపు సంతరించుకునే అవకాశముంది. కాగా, ఒకేసారి రెండు రైళ్లు వచ్చినా సాఫీగా రాకపోలు జరిగేందుకు రెండు మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆఖరు దశకు చేరాయని, రెండేసి లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫాం పొడిగింపు, దివ్యాంగుల కోసం కొత్త టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, వెయిటింగ్ హాల్ నిర్మాణం కూడా పూర్తికావొస్తున్నాయి.
వేగంగా ఆధునికీకరణ పనులు
●అత్యాధునికంగా ఖమ్మం స్టేషన్ !