
శ్రీనివాస గిరి కల్యాణ ప్రచార రథం ప్రారంభం
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాస కాలనీ శ్రీనివాస గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(గుట్ట)పై మార్చి 24వ నుంచి 27 వరకు నిర్వహించే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచార రథాన్ని ఆదివారం కేటీపీఎస్ 7వ దశ సీఈ శ్రీనివాసబాబు, కొత్త వెంకటేశ్వర్లు, వైద్యులు బిక్కసాని సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్త సమాజ మండలి అధ్యక్షుడు ఆరుట్ల లక్ష్మణాచార్యులు మాట్లాడుతూ.. ప్రచార రథం ఉమ్మడి జిల్లా, చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యటించనుందన్నారు. కార్యక్రమంలో సునీల్‌కుమార్, ధర్మపురి రాము, ఊకె భద్రయ్య, కందుకూరి రామకృష్ణ, తాటికొండ శ్రీలత, వంకదారు నర్సింహకుమార్, మిట్టపల్లి నర్సింహారావు, కంఠాల వెంకటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, కిలారు పురుషోత్తం, మేదరమెట్ల శ్రీనివాసరావు, బండి నారాయణ, ఏటుకూరి నరేశ్, రమేశ్, రాంజీ, వెంకి, వెంకట సుబ్బయ్య, చనుమోలు శ్రీనివాసరావు, కనగాల శ్రీనివాసరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.