‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి

Mar 9 2025 12:19 AM | Updated on Mar 9 2025 12:19 AM

‘థర్డ

‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి

● పోలీస్‌ స్టేషన్‌ వద్ద బాధితుడు, దళిత సంఘాల డిమాండ్‌

అశ్వారావుపేట: కోడి పుంజు చోరీ కేసులో తనపై థర్డ్‌ డిగ్రీ, కరెంట్‌ షాక్‌ ఇచ్చిన స్థానిక అదనపు ఎస్‌ఐ రామ్మూర్తిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని బాధితుడు, దళిత సంఘాల బాధ్యులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన కలపాల నాగరాజుపై అదే గ్రామానికి చెందిన అప్పారావు కోడి పుంజు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నెల 1వ తేదీ రాత్రి నాగరాజును ఒప్పుకోవాలని స్థానిక అదనపు ఎస్‌ఐ రామ్మూర్తి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి, కరెంట్‌ షాక్‌ ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం బాధితుడిని కుటుంబీకులు, దళిత సంఘాల నాయకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి న్యాయం చేయాలని కోరారు. అలాగే, సీఐ కరుణాకర్‌ను కలిసి అదనపు ఎస్‌ఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బాధితుడు, దళిత సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు తగరం రాంబాబు మాట్లాడారు. కోడి పుంజు కేసు నెపంతో తీవ్రవాదిలా వ్యవహరించి థర్డ్‌ డిగ్రీకి పాల్పడి, చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. దళితుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ఇలాంటి దాష్టికానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, ఎస్పీ స్పందించి సమగ్ర విచారణ జరిపించాని డిమాండ్‌ చేశారు.

చోరీ నిందితుడి అరెస్ట్‌

పాల్వంచ: పట్టణంలోని నవభారత్‌ ఎంప్లాయీస్‌ క్వార్టర్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం సీఐ సతీశ్‌ వివరాలు వెల్లడించారు. శనివారం పట్టణంలోని సీ–కాలనీ వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ సతీశ్‌, పట్టణ ఎస్‌ఐ సుమన్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. నవభారత్‌ ఎంప్లాయీస్‌ క్వార్టర్లలో చోరీలకు పాల్పడిన, మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ధార్‌ జిల్లా తండా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అనిల్‌ సింఘూర్‌గా గుర్తించారు. గత జనవరి 25న మరో ముగ్గురితో కలిసి నవభారత్‌ క్వార్టర్లలో చోరీలకు పాల్పడ్డాడని, అతని వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఒక స్మార్ట్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నామని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మరో నెలలో పెళ్లికి సిద్ధమవుతుండగా ఘటన

కారేపల్లి: మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన యువకుడు మహబూబా బాద్‌ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట సమీపాన శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యతండాకు చెంది న బానోతు కళ్యాణ్‌ (26), అజ్మీరా విజయ్‌ ద్విచక్రవాహనంపై శుక్రవారం గంగారం మండలం ఒట్టయిగూడెంలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. ఈక్రమాన మిర్యాలపెంట వద్ద బైక్‌ అదుపు తప్పి వాహనం నడుపుతున్న కల్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయ్‌ స్వల్పగాయంతో బయటపడ్డాడు. దీంతో స్థాని కులు వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కళ్యాణ్‌ మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సూర్యతండాకు శనివారం తీసుకొచ్చారు. కాగా, కళ్యాణ్‌కు రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. హోలీ పండుగ తర్వాత ముహూర్తం పెట్టుకోవాలని భావిస్తుండగానే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి 1
1/2

‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి

‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి 2
2/2

‘థర్డ్‌ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement