జయహో.. జన ర ుుత్రి | - | Sakshi
Sakshi News home page

జయహో.. జన ర ుుత్రి

Mar 8 2025 12:23 AM | Updated on Mar 8 2025 12:23 AM

జయహో.. జన ర ుుత్రి

జయహో.. జన ర ుుత్రి

మహిళల రక్షణ, అభివృద్ధే ధ్యేయంగా..

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ప్రజలతో మమేకం.

మధిర : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మల్లు నందిని నిరంతరం ప్రజల్లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. నిరంతరం శ్రమిస్తూ, ప్రజలతో మమేకమవుతూ ముదుకు సాగుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయూల్లో నిత్యం బిజీగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ జాతీయు రాజకీయూల్లో సైతం బిజీగా ఉంటున్నారు. మల్లు నందిని నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, నాయకులకు కొండంత అండగా ఉంటున్నారు. మండలాల్లో పార్టీ నాయుకులను సమన్వయుం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా తన భర్త హోదాను దుర్వినియోగం చేయుకుండా, అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా ఆమె తనదైన శైలిలో రాణిస్తున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ఆప్యాయంగా చేరదీస్తూ మల్లు నందిని చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆప్యాయుతగా అమ్మ అంటూ పిలిస్తే, నేనున్నానంటూ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అమ్మ ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ప్రమాద ఘటనలో గాయపడినా, మృతి చెందిన వారి కుటుబాలను పరామర్శిస్తూ వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలకు ఫోన్‌ చేస్తూ వైద్య బిల్లులు తగ్గించేలా కషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయుకులు, కార్యకర్తలు ఆమెను తలైవిగా పిలుస్తూ ఫ్లెక్సీలు కడుతూ నందినమ్మకు మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో అమ్మ ఫౌండేషన్‌ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement