పాల్వంచరూరల్ : పెద్దమ్మగుడి పాలకవర్గ జాబితాను వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. 14 మంది సభ్యులతో కూడిన జాబితా గురువారం ఈఓకు చేరినా.. వివరాలు వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. జాబితాలో పేర్లున్న వారితో కలిసి ఈఓ, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్‌స్పెక్టర్ శుక్రవారం రహస్యంగా సమావేశమై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎటువారు అటు వెళ్లిపోయారు. ఆలయ గత పాలకవర్గ పదవీకాలం 2024 మార్చితో పూర్తికాగా, నూతన పాలకవర్గ నియామకానికి దేవాదాయ శాఖ డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో అసక్తి గల 30 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఎవరికి స్థానం దక్కిందనేది సస్పెన్స్‌గా మారింది.