
● 24 గేట్లు ఎత్తి దిగువకు విడుదల
కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తిన దృశ్యం
ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వెళ్తున్న వరద
● తాలిపేరుకు పెరుగుతున్న వరద
చర్ల: మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లలో 24 గేట్లు ఎత్తి 89,954 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యాన నీటి మట్టాన్ని 71.66 మీటర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యాన భారీగా వరద వచ్చే అవకాశమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
● నిండుకుండలా కిన్నెరసాని జలాశయం
పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తడంతో నిండుకుండను తలపిస్తోంది. 407 అడుగుల నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌లోకి 21 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో బుధవారం 404.20 అడుగులకు చేరింది. దీంతో నాలుగు గేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, నాలుగు గేట్లను ఎత్తడంతో రాజాపురం, యానంబైల్ మధ్య లోలెవల్ చప్టాపైకి వరద చేరగా పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

● 24 గేట్లు ఎత్తి దిగువకు విడుదల

● 24 గేట్లు ఎత్తి దిగువకు విడుదల

● 24 గేట్లు ఎత్తి దిగువకు విడుదల