భద్రాచలంటౌన్: పట్టణా నికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎస్కే షరీఫ్‌కు జాతీ యస్థాయి అవా ర్డు లభించింది. ఈ మేరకు మంగళవారం ఆయన వివరా లు వెల్లడించా రు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సృజనాత్మకత, సంస్కృతి కమిషన్, ఇండి యా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ), ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండి యా (పీఏఐ) సహకారంతో ఏపీ ప్రభుత్వం నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించింది. షరీఫ్ తీసిన చిత్రం ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించగా ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డు–2025కు ఎంపికై ంది. ఈ నెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో అవార్డును అందుకోనున్నట్లు షరీఫ్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో కీచకోపాధ్యాయుడు
●విద్యార్థిని పట్ల అసభ్యకరంగా
ప్రవర్తించినవైనం
దుమ్ముగూడెం: మండల పరిధిలోని లక్ష్మీనగరం ఏకలవ్య పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని పట్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల క్రితం శరీరంపై ఉపాధ్యాయుడు చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడని, కంటితో అసభ్యకరంగా సైగలు చేశాడని విద్యార్థిని తల్లికి తెలిపింది. దీంతో ఆమె పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా, ప్రిన్సి పాల్ సదరు ఉపాధ్యాయుడికి మెమో జారీ చేసినట్లు తెలిసింది. కాగా ఈ ఘటనపై ఆర్‌సీఓ అరుణకుమారిని వివరణ కోరగా.. విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేస్తామని తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
ఇల్లెందురూరల్: పోలీసులు మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం.. ఖమ్మానికి చెందిన ఈశ్వరప్రగడ రంగనాథ్ మండలంలోని సుభాష్‌నగర్‌లో బైక్ షోరూం ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను ఇల్లెందుకు చెందిన యాలం దయాసాగర్‌కు అప్పగించాడు. ఏడాదిపాటు నిర్వహణ చేపట్టిన అతను యజమానికి తెలియకుండా రూ. 12.31 లక్షల విలువైన బైక్‌లను విక్రయించి నగదును తన సొంతానికి వాడుకున్నాడు. అందులో కొంత చెల్లించాడని, ఇంకా రూ. 8.82లక్షలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని బాధితుడు ఫిర్యాదు చేశౠడు. దీంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
వ్యక్తిపై పోక్సో కేసు
పాల్వంచ: ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వీడియోలు వీక్షించిన ఓ వ్యక్తిపై పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. 2024 సంవత్సరంలో ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పిల్లల లైంగిక వీడియోలు వీక్షించారు. ఈ క్రమంలో సైబర్ క్రైం అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.