న్యూస్‌రీల్
నోటిఫికేషన్ రద్దు వార్తలతో ఆందోళన
జీజీహెచ్‌లో ఉద్యోగాలకు ఏడాదిగా ఎదురు చూపులు
● ఉద్యోగ నియామకాలపై
కిమ్మనని జీజీహెచ్ అధికారులు
● ‘సాక్షి’ కథనంతో ఈ ఏడాది
ఏప్రిల్‌లో మెరిట్ లిస్టు ప్రకటన
● అప్పటి నుంచి పోస్టింగులు ఇవ్వని వైనం
● ఏడాది దాటితే నోటిఫికేషన్ మారిపోతుందని
దరఖాస్తుదారుల ఆందోళన
● గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్
అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం
సుమారు రూ.6 కోట్ల ఐపీతో
దిగుమతి వ్యాపారులకు నోటీసులు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డులోని వ్యాపార వర్గాల్లో ఐపీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మిర్చి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఓ ఎగుమతి వ్యాపారి తాజాగా రూ.6 కోట్ల మేర ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. ఐపీ ప్రక్రియలో భాగంగా తనతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సుమారు 64 మంది మిర్చి దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. యార్డులో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారం నిత్యం కోట్ల రూపాయల్లోనే లావాదేవీలు జరుగుతుంటాయి. దిగుమతి వ్యాపారుల నుంచి ఎగుమతి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం విదేశీ మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య సరుకు సరఫరా, చెల్లింపులు, బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి ఐపీ దాఖలు చేసి సంబంధిత దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపడం బాధితుల్లో ఆందోళన రేపుతోంది. తమ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు భయపడుతున్నారు. రెండున్నర ఏళ్లుగా యార్డులో పలువురు కోట్ల రూపాయల్లో ఐపీలు పెట్టడం గమనార్హం. తాజాగా మరొకరు అదే బాటలో వెళ్లడం మిర్చి వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఏడాదిలో ఐదో ఐపీ..
ఈ ఏడాది అన్ సీజన్ జూన్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసుకొంటే ప్రస్తుతం ఐపీ దాఖలు చేసిన వ్యాపారి ఐదవ వ్యక్తి. గతంలో నలుగురు ఎగుమతి వ్యాపారులు ఇదే రీతిన దివాళా తీశారు. ఈ ఏడాది సుమారు రూ.27 కోట్లకు పైగా ఐపీ దాఖలు చేశారు. ఇటీవల మిర్చి ఎగుమతిదారులు ఐపీ దాఖలు చేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై మిర్చి రైతులు, దిగుమతి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ రిక్రూట్‌మెంట్ చేయడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారుల తీరుతో అభ్యర్థులు ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతున్నారు. అధికారులు నత్తకు పోటీగా పనిచేస్తూ విమర్శలు మూటకట్టుకుంటున్నారు.
కలెక్టర్ ఆదేశించినా...
గుంటూరు వైద్య కళాశాలలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు సెప్టెంబర్ 9, 2025న నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 61 పోస్టులు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదే ఏడాది నవంబరులో ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగాలు ఇస్తామని రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌లో ప్రకటించారు. దీంతో గుంటూరు జీజీహెచ్, జీజీహెచ్ నాట్కో క్యాన్సర్‌సెంటర్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్ పోస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంతో మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏడాదిగా ఉద్యోగపు నియామకపు ఉత్తర్వులు అభ్యర్థులకు అందించలేదు. కనీసం ప్రొవిజన్ మెరిట్ లిస్టు కూడా ప్రకటించలేదు. దీనిపై ‘నో.. టిఫికేషన్!’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్ 15న ‘సాక్షి’లో కథనం వెలువడడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరితగతిన ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య కళాశాల అధికారులు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సైతం పూర్తి చేశారు. ఆప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారులు తాత్సారం చేస్తున్నారు.
ఏడాదిన్నరగా జీతాలు లేవు..
2025 మార్చిలో గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్‌లో 27 మంది ఉద్యోగులు రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారు. నేటికి ఉద్యోగులు విధుల్లో చేరి ఏడాదిన్నర అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క నయాపైసా జీతం చెల్లించలేదు. ఏడాదిన్నరగా వేతనాలు లేకుండానే ఉసూరు మంటూ క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాల అధికారులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
సమన్వయ లోపమే శాపం
వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైల్స్ మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఉపయోగపడే పనులు మాత్రం పక్కన పడేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా జీజీహెచ్ చైర్మన్‌గా వ్యవహరించే జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ సమస్యపై దృష్టి సారించి, త్వరితగతిన రిక్రూట్‌మెంట్ జరిగేలా, జీతాలు త్వరగా మంజూరయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
పురపోరుకు సిద్ధం
ఉద్యోగాలు సకాలంలో భర్తీ చేయని పక్షంలో గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాది లోపు రిక్రూట్‌మెంట్ చేయకపోతే ఆటోమ్యాటిక్‌గా నోటిఫికేషన్ రద్దవుతుంది. ఈనేపథ్యంలో నెల, రెండు నెలల్లో చేయాల్సిన నియామకాలు ఏడాది గడిచినా జరగకపోవడంతో ఉద్యోగాలు వస్తాయా.. రావా అన్న.. డైలమాలో దరఖాస్తుదారులు కొట్టుమిట్టాడుతున్నారు.


