చెరుకుపల్లి: ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే తప్పనిసరిగా బలవర్ధక ఆహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిణి ఎస్ విజయమ్మ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మండలంలోని కనగాల పీహెచ్‌సీలో సేవా సంకల్ప్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంబించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, డిజిటల్ అక్షరాస్యత, యువతకు ఉపాధి కల్పించాలని ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులు ప్రత్యేక ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం అక్టోబర్ 17వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి రోజూ సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కనగాల వైద్యాధికారులు భావన, డాక్టర్ జీవనలత, గ్రామస్తులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ


