వినాయక నిమజ్జనంలో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM

అమర్తలూరు (వేమూరు): వినాయక నిమజ్జనంలో యువకుడు విద్యుత్‌ షాక్‌కు గురైన ఘటన అమర్తలూరు మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమర్తలూరు మహాత్మాగాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన వినాయకుడి ఊరేగింపు జరిగింది. ఊరేగింపు సమయంలో అడ్డు వచ్చిన విద్యుత్‌ వైర్లు తప్పిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు హర్షవర్ధనకు విద్యుత్‌ షాక్‌కు గురై కింద పడ్డాడు. 108 సహాయంతో తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు మెరుగైన వైద్యం కోసం తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement