లక్ష్మీపురం(గుంటూరుఈస్ట్): ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యులను, పొరుగు వారిని స్వచ్ఛతా ప్రచారంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని, తద్వారా వారు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను నిర్వహించడానికి దోహదపడాలని డీఆర్‌ఎం సుధేష్ణ సేన్ అన్నారు. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ‘స్వచ్ఛతా హి సేవ–స్వచ్ఛతా పక్షోత్సవం–2026’ ప్రచారంలో భాగంగా గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హి సేవ–స్వచ్ఛతా పక్షత్సవం కార్యక్రమంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి సుమారు ఆరు టన్నుల చెత్తను తొలగించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా–స్వచ్ఛతా పక్షోత్సవం–2026 ప్రచారం అక్టోబర్ 10వ తేదీ వరకు డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 11 నుంచి ఉత్సవాలు
Sep 18 2026 2:03 AM | Updated on Sep 18 2026 2:03 AM
అక్టోబర్ 11 నుంచి ఉత్సవాలు దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కె.సునీల్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబరు 20వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, ఆలయంలో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి.దేవకుమార్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ స్వరూప్‌కాంత్, గుంటూరు జీజీహెచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కట్టా శ్రీనివాస్, యూనియన్ నేతలు డాక్టర్ వాసవి, డాక్టర్ కమల, డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
కొల్లిపర: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల పరిశీలనలో భాగంగా కొల్లిపరలోని హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జ్యోతిబసు గురువారం పరిశీలించారు. ఆయన స్కూల్ విద్యార్థులను కలసి జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన ప్రశ్నలు అడిగా సమాధానాలు రాబట్టారు. పాఠశాల ఆవరణలో గతంలో ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల విగ్రహాలను పరిశీలించి వారి జీవిత చరిత్రను ప్రతి విద్యార్థికి గుర్తు ఉండే విధంగా తెలియజేయాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. ఈసారి తాను వచ్చే సరికి ప్రతి విద్యార్థి ఆవరణలో ఉన్న శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను అడగగానే చెప్పే విధంగా ఉండాలన్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎంపీడీఓ విజయలక్ష్మికి, సిబ్బంది పలు సూచనలు చేశారు. ‘స్వచ్ఛతా..’ ప్రచారంలో
పాల్గొనండి
Advertisement


