చిలకలూరిపేట: ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను వెంటనే కల్పించాలని ఎస్టీయూ రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె . కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎస్టీయూ పట్టణశాఖ సమావేశం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాఽఽధ్యాయులకు సంబందించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎంఈవో, హైస్కూల్ హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లు, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం పోస్టులు వెంటనే పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, అదే సమయంలో విద్యార్థులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు లేకపోవడం వల్ల విద్యలో నాణ్యత కొరవడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బొంతా రవి, ఎం.శారదా, విజయకుమార్, షేక్ జమీర్, మేకల కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మక్బూల్‌బాష తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూ నాయకుల డిమాండ్


