మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులో నిందితుడు అరెస్టు

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

8 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం

నరసరావుపేట టౌన్‌: వివిధ ప్రాంతాలలో ఎనిమిది మోటార్‌ సైకిళ్లను చోరీ చేసిన కేసులో నిందితుడైన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన షేక్‌ షబ్బీర్‌ను పట్టణంలోని డీమార్ట్‌ వద్ద మంగళవారం అరెస్టు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు బుధవారం తెలిపారు. మొదటి పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. నిందితుడు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 8 మోటార్‌ సైకిళ్లను చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. వాటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు ఉంటుందన్నారు. నిందితుడు బైక్‌ మెకానిక్‌గా పని చేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో మోటార్‌ సైకిళ్లను చోరీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో మొదటి పట్టణ సీఐ షేక్‌ ఫిరోజ్‌, ఎస్‌ఐ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement