గుంటూరు లీగల్: చట్టాలపై మహిళలకు అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్‌లో ఉన్న బాధిత మహిళలతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయ పరమైన సలహాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వారికి అందే చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సెలర్ శాంతకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. ఐపీడీ కాలనీ, సాయికృష్ణ నగర్‌లోని ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోమ్‌ను సందర్శించి అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్


