ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు

Apr 3 2026 7:50 AM | Updated on Apr 3 2026 7:50 AM

ఇంకొల్లు(చినగంజాం): వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో ఎక్కువ మందికి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శివన్నారాయణ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో మండలంలో 1 ఏప్రిల్‌ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు చేసిన పనులకు సంబంధించి గురువారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మొత్తం 517 పనులకు సామాజిక తనిఖీ బృందం ప్రజావేదిక ద్వారా బహిరంగంగా విచారించి సమీక్ష నిర్వహించారు. కూలీలకు రూ.8.98 కోట్లు, మెటీరియల్‌కు రూ 3.24 కోట్లు, మొత్తం రూ.12.22 కోట్లు ఖర్చు చేశారని సామాజిక తనిఖీ రిసోర్స్‌పర్సన్‌లు వివరించారు. ఆడిట్‌ నిర్వహించిన అనంతరం రూ.2.95 లక్షల నగదును రికవరీ చేయాల్సిందిగా గుర్తించారు. అనంతరం ఏపీడీ మాట్లాడుతూ ఆడిట్‌లోగుర్తించిన అంశాలను తెలుసుకొని మళ్లీ తిరిగి జరగకుండా రికార్డు ప్రకారం పనిచేయించాలని సిబ్బందికి ఆయన సూచించారు. గ్రామాల్లో కూలీలకు ఎక్కువగా పనులు కల్పించాలని, కూలీల మస్టర్‌కు సంబంధించి యాప్‌ను ఉపయోగించాలని, యాప్‌ పనిచేయకపోతే వెంటనే తెలియజేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హ్యూమన్‌ రిసోర్స్‌పర్సన్‌ చంద్రశేఖర్‌, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి సతీష్‌, స్టేట్‌ రిసోర్స్‌పర్సన్‌ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీవో కే సత్యనారాయణ, ఏపీఓలు బుల్లిబాబు, రేణుక, జూనియర్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, జిల్లా రిసోర్స్‌ పర్సన్‌లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శివన్నారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement