వేమూరు: నిరుపేదలకు ఇళ్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్టి తెలిపారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాల ప్రవేశాల కార్యక్రమంలో సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.58 లక్షల గృహాలను జయప్రదంగా గృహా ప్రవేశాలు కార్యక్రమం చేపట్టిందన్నారు. సొంత స్థలాలు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు కేటాయించడంతోపాటు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గృహాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 335 గృహ ప్రవేశాలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, రేపల్లె ఆర్డీఓ, శ్రీదేవి, తహసీల్దార్ నెహ్రుబాబు, గృహ నిర్మాణ శాఖ డీఈ పాల్గొన్నారు.


