కోనేటిపురం(భట్టిప్రోలు): వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్ పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామంలో సోమవారం పీండీఎస్ (ఫ్రీమాన్ సూన్ డ్రై సోయింగ్) కార్యక్రమం హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిలో బీజామృతం, బంకమట్టి, ఘన జీవామృతం పౌడర్, బూడిదతో తయారు చేయాలని తెలిపారు. ఈ పద్ధతిలో మినుములు, పెసలు, శనగలు, అలసందలు, కందులు లాంటి విత్తనాలను గుళికలుగా తయారు చేయవచ్చని చెప్పారు. రైతులు ఈ పద్ధతులను అనుసరించి విత్తనాలు వేయడం వల్ల వర్షాలు లేకపోయినా తక్కువ తేమతోనే మొలకలు వస్తాయన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఎన్‌ఎఫ్‌ఎ బి.వి. శ్రీనివాస్, మండల నోడల్ పర్సన్ డి.ఝూన్సీరాణి, ఎఫ్‌ఎన్‌టీలు సురేష్, బాలాజి, ఐసీఆర్పీస్‌లు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్


