ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాజ్యాంగం | - | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాజ్యాంగం

Mar 18 2026 9:39 AM | Updated on Mar 18 2026 9:39 AM

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు రాజ్యాంగం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం దేశం మొత్తం అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు నాయుడు రాజ్యాంగం అమలు అవుతోందని మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఎంతో పవిత్రంగా చూసే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసేలా చంద్రబాబు సర్కారు పని చేస్తోందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని నింద వేయటం ఎంతో దారుణమన్నారు. కల్తీ లేదని సీబీఐ తేల్చినా చంద్రబాబు సర్కారుకు బుద్ధి రాలేదన్నారు. ఇప్పుడు ఆ దేవస్థానం చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం సిగ్గు చేటన్నారు. ఆ పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగకుండా ఆయన రాజీనామా చేయాలని కోన డిమాండ్‌ చేశారు. హిందువుల మనోభావాలు ఎల్లప్పుడూ కాపాడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తే ఆయనను క్రిస్టియన్‌గా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుందన్నారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్‌, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగ మోహన్‌ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి, నాయకులు నక్క వీరారెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరులీలా శ్రీనివాసరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్‌, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement