న్యూస్‌రీల్
ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీల తొలగింపు అన్యాయం
తొలగించిన ఫ్లెక్సీలను తిరిగి ఏర్పాటు చేయాల్సిందే
లేదంటే రేపల్లె పట్టణంలో అన్ని ఫ్లెక్సీలను తొలగించాలి
వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి
సమన్వయకర్త నాగమోహన్‌కృష్ణ ఆందోళన
కార్యక్రమాన్ని అడ్డుకున్న
పట్టణ సీఐ మల్లికార్జునరావు
నాయకులు, పోలీసులు మధ్య
తీవ్ర వాగ్వాదం
అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం
అందజేసిన పార్టీ నాయకులు
బాపట్ల
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.24 4.58 నరసరావుపేట 6.26 5.00 బాపట్ల 6.24 4.58
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు.
రేపల్లె: ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నాయ కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను వెంటనే ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పట్టణంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత మూడు గంటలకు పైగా కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రహదారిపై బైఠాయించి ప్రజాస్వా మ్య పరిరక్షణ కోరుతూ నినాదాలు చేశారు. డీఈ మధుసూదనరావు ఫ్లెక్సీల తొలగింపుపై సమాధానం ఇవ్వకపోవటంతో నిరసన కొనసాగించారు. సమాచా రం అందుకున్న పట్టణ సీఐ మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ నాయకులు, పోలీసు ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరించాలని నాగమోహన్‌కృష్ణ డిమాండ్‌చేశారు. అనంతరం తాలూకా సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కు వెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ వినతి పత్రా న్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను మీరు తొలగిస్తారా... మేము తొలగించమంటారా అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే అక్కడే ఉన్న సీఐ వాగ్వాదానికి దిగా రు. అడ్డుకోబోయి న నాగమోహన్‌కృష్ణతో వాగ్వాదంకు దిగి చొక్కా పట్టుకుని స్టేషన్‌లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో చేసేదిలేక సీఐ బెదిరింపులకు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
● నాగమోహన్‌కృష్ణ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గంలో అధికారులు అధికార ప్రతినిధులకు తొత్తులుగా పనిచేయటం సిగ్గుచేటన్నారు. రేపల్లె పట్టణంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నా మున్సిపల్ కమిషనర్ కంటికి కనిపించకపోవటం బాధాకరమన్నారు. మంత్రి మెప్పుపొందేందుకు వైఎస్సార్ సీపీ ప్లెక్సీలను మాత్రమే తొలగించటం హేయమైన చర్యన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే అన్ని ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శాంతియుత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్, మండల కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ వీసం నాగలక్ష్మి, నాయకులు ఉమారాణి, చందోలు నాగలక్ష్మికుమారి, సజ్జా పద్మావతి, ఆలా రాజ్‌పాల్, నిజాంపట్నం కోటేశ్వరరావు, కొలుసు బాలకృష్ణ, నాగిశెట్టి పవన్, వుయ్యూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


