పర్చూరు(చినగంజాం): నాణ్యత ప్రమాణాల ఆధారంగా రైతుల వద్ద నుంచి శనగల కొనుగోలు చేస్తామని జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్) అధికారులు మనోజ్, భానుచందర్‌లు సూచించారు. మండలంలోని నూతలపాడు గ్రామంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని వారు సోమవారం సందర్శించారు. శనగల కొనుగోలు తీరును పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళారుల జోక్యం లేకుండా నేరుగా రైతుల వద్ద నుంచి నాణ్యతను ప్రమాణంగా తీసుకొని శనగ కొనుగోలు చేస్తారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ విన్నకోట సతీష్, రైతులు పాల్గొన్నారు.


