ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతిని సోమవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, పలుమార్లు జైలుకు వెళ్లిన గాంధేయవాది అన్నారు. ఆంధ్రుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఖ్యాతిని ప్రతి తెలుగు వారు గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ భుజంగరావు, ఎస్‌బీ–2 సీఐ రాంబాబు, వెల్ఫేర్ ఆర్‌ఐ మౌలుద్దీన్ పాల్గొన్నారు.


