పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం రద్దుచేయాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం రద్దుచేయాలి

Mar 17 2026 7:39 AM | Updated on Mar 17 2026 7:39 AM

తెనాలి: కేంద్ర పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం–2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. తెనాలి హెడ్‌ పోస్టాఫీసులో జరిగిన తెనాలి డివిజన్‌ పోస్టల్‌, ఆర్‌ఎంఎస్‌ పెన్షనర్ల వార్షిక సమావేశానికి డివిజనల్‌ అధ్యక్షులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎన్‌.నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్రప్రభుత్వ పెన్షనర్లు అందరినీ 8వ వేతన సంఘ పరిధిలోకి తీసుకోవాలని, 8వ వేతన సంఘాన్ని 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనుకూలంగా సీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్థానిక డివిజనల్‌ కార్యదర్శి ఎల్‌.ప్రసాదరావు, కోశాధికారి పి.జోనేష్‌, రషీద్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆలిండియా జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 8వ కేంద్ర వేతన సంఘ టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోరిన ప్రశ్నావళి గురించి వివరించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్‌ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పెన్షనర్ల డివిజనల్‌ కార్యదర్శి ఎన్‌జీ ఘోష్‌, పెన్షనర్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.తిరుమలరావు, బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్ల నాయకులు శివ మాట్లాడారు. తదుపరి 70–90 ఏళ్లు నిండిన సంఘ సభ్యులను గౌరవంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement