జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. అర్జీదారులు సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు.


