చీరాల రూరల్: ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హరిష్ కుమార్ గుప్తా చేతులు మీదుగా 2025 సంవత్సరం త్రైమాసికానికి సంబంధించి శుక్రవారం చీరాల, ఒంగోలు రైల్వే పోలీసులు ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డులు అందుకున్నారు. గతేడాది ఒంగోలు జీఆర్పీలో నమోదైన కేసును మూడు రోజుల్లో త్వరితగతిన ఛేదించి పోగొట్టుకున్న 341 గ్రాములు బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను రికవరీచేసి బాధితులకు అందజేశారు. దీనికి గాను ఈ అవార్డును అందజేసినట్లు చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. కేసు దర్యాప్తు రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఎస్‌ఆర్‌పీ సత్యదేవ్‌సింగ్ పర్యవేక్షణలో చేసినట్లు చెప్పారు. కేసు చేధనలో చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య, ఒంగోలు సీఐ షేక్ మౌలా షరీఫ్, నెల్లూరు డీఎస్పీ జి.మురళీధరరావు, హెడ్‌కానిస్టేబుల్ కె.భాస్కర్, కానిస్టేబుల్ బి.రాము అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.


