డీఆర్‌ఓ గంగధర్ గౌడ్
బాపట్ల: మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని కవయిత్రి మొల్ల మాంబ తన రచనల ద్వారా నిరూపించారని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల మాంబ జయంతి శుక్రవారం నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టరేటలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగగలరని కవయిత్రి మొల్ల మాంబ తన రచనల ద్వారా నిరూపించారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో కవయిత్రి మొల్ల మాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నాయకులు డీఆర్వోఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డీడీ శివ నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు.


