బాపట్ల: ప్రతి విద్యార్థికి చదువుతోపాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎన్‌సీడీ సీడీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. స్థానిక బధిరుల పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న వెదుళ్ళపల్లి వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టరు విజయమ్మ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని చెప్పారు. ఆర్‌కేఎస్‌కే స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలగ్లోరీ, డీఐఓ సీహెచ్ రత్న మన్మోహన్, డాక్టర్ లలితా రాజేశ్వరి, సౌజన్య, లక్ష్మీసౌజన్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
అవయవ దానంపై అవగాహన అవసరం
బాపట్ల టౌన్: అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. శిబిరానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన బాపట్ల ఏరియా వైద్యశాలలో అవయవదానంపై అవగాహన, నమోదు శిబిరం జరుగుతుందన్నారు. బ్రెయిన్ డెడ్ సందర్భంలోనే దాతల అవయవాలను తీసుకొని, అవసరమైన వారికి వినియోగిస్తారని తెలిపారు. దాతలు తమ ఆధార్ కార్డు వివరాలతో ఈ శిబిరంలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కే సిద్ధార్థ, కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు, సభ్యులు కె. అనిల్ కుమార్, పి. ప్రసాదరావు పాల్గొన్నారు.


