వేమూరు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగకుండా పని చేయించాలని డ్వామా జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఎ. విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సామాజిక తనిఖీ ప్రజా వేదిక మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వేతనాల వివరాలపై కూలీలకు అడిగి తెలుసుకున్నారు. చిన్న తప్పుల వల్ల రూ. 30 వేల వరకు రికవరీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవి కుమార్, హెచ్‌ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, సతీష్, సత్య కృష్ణ, సామాజిక తనిఖీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


