‘బాబు’య్‌...‘డాబు’య్‌..! | - | Sakshi
Sakshi News home page

‘బాబు’య్‌...‘డాబు’య్‌..!

Mar 10 2026 7:32 AM | Updated on Mar 10 2026 7:32 AM

‘బాబు’య్‌...‘డాబు’య్‌..!

ఆర్భాటం ఎక్కువ ... ఆచరణ శూన్యం ఉట్టికి ఎక్కలేనోడు .. స్వర్గానికి ఎక్కుతానన్నట్లు.. ఇంటి జాగాకు గతి లేదు ... త్రీ బెడ్‌ రూమ్‌ ఇల్లు ఇస్తాడట! ఆడబిడ్డ నిధి ఎక్కడ బాబు అని మండిపడుతున్న మహిళలు అభివృద్ధి గాలికి .. ఆత్మస్తుతి, పరనిందకు పెద్దపీట ఇదేనా చంద్రబాబు విజనరీ అని ప్రశ్నిస్తున్న ప్రజలు

చీరాల అర్బన్‌: చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఎక్కువ. ఆచరణ సున్నా. బాబు మాటలు, నీటి మూటలు. ఉట్టికి ఎక్కలేనోడు, స్వర్గానికి ఎక్కుతానన్నట్లు బాబు మాటలు, చేతలు ఉంటున్నాయి. అభివృద్ధిని గాలికి వదిలేసి, ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యం. ఇదేనా చంద్రబాబు విజనరీ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అందుకు దర్పణం పడుతున్నాయని అంటున్నారు. ఎన్నికల వేళ ప్రకటించిన ఆడబిడ్డ నిధి ఎక్కడ బాబు? ఎప్పుడు అమలు పరుస్తావంటూ మహిళలు మండిపడుతున్నారు.

ఆడబిడ్డ నిధి హామీతో మహిళల ఓట్లు

గత అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఆ పథకంతో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నది ప్రధానమైంది. ఆ హామీతో మహిళలు కొంతమేర టీడీపీ వైపు మొగ్గుచూపారు. ఓట్లు దండుకున్నారు. గెలిచాక ఆ హామీని మరిచారు. దీనిపై మహిళలు మండి పడుతున్నారు.

ఇంటి జాగా లేదు.. త్రీ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తాడంట!

చంద్రబాబు సర్కార్‌ వచ్చి సుమారు రెండు సంవత్సరాలవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు ఇంటి స్ధలం ఊసేలేదు. ఇప్పుడు పెద్ద కుటుంబానికి త్రీ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ఇస్తానని హామీ ఇస్తున్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, సమస్యలకు సంబంధించి ప్రజల దృష్టిని మర ల్చేందుకు ఇలాంటి మాయమాటలు చెప్పటం బాబుకు అలవాటయ్యిందని ప్రజలు అంటున్నారు. ఇదేనా బాబు విజనరీ అని విమర్శిస్తున్నారు.

ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట

చంద్రబాబుది అంతా డైవర్షన్‌ రాజకీయం. తిరుపతి లడ్డూ నుంచి అన్ని అంశాలలో అతనిది అదే పంధా. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట. బాబు పాలన వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవవుతున్నా .. ఇంకా గత ప్రభుత్వ వైఫల్యమని నిందలు వేస్తూ, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. హామీల బాబు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement