బాపట్ల
న్యూస్‌రీల్
పోలీసులతో ఆర్థిక లావాదేవీలు బయటపెట్టిన రౌడీషీటర్ ఏకంగా సీఐపైనే పీఎస్‌లో ఫిర్యాదు చేయడంలో మతలబేంటో? టీడీపీ నేతల అండదండలతోనే అరాచకాలు కొనసాగింపు బాపట్ల జిల్లాలో రౌడీషీటర్ వ్యవహారంపై చర్చ
శుక్రవారం శ్రీ 23 శ్రీ జనవరి శ్రీ 2026
చంద్రబాబు సర్కార్ వచ్చాక పెట్రేగిపోతున్న టీడీపీ రౌడీషీటర్
బాపట్ల జిల్లా చుండూరు మండలం కొత్త నారికేళపల్లి సర్పంచ్‌పై హత్యాయత్నం చేసి, ఆయన తప్పించుకోవటంతో ఆగ్రహం చెందిన టీడీపీ నాయకుడు గుదేటి బాలకోటిరెడ్డి తన అనుచరులతో సర్పంచ్ ఇంటిని ధ్వంసం చేశాడు. ఈ కేసులో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. రేపల్లె డీఎస్పీతో తనకు గల ఆర్థిక లావాదేవీలను అతడే స్వయంగా బహిర్గతం చేసి, తాను సాగిస్తున్న అరాచకాలకు పోలీసులతో తనకున్న లాలూచీ వ్యవహారాలను చాటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. కోడి పందేల కోసం పోలీసు శాఖలో ఒక ఉన్నతాధికారికి రూ.పది లక్షలు ఇచ్చానని బహిరంగంగా చెబుతుండటం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,600, గరిష్ట ధర రూ.3,700, మోడల్ ధర రూ.3,000 వరకు పలికింది.
వినుకొండ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్‌ఎస్‌పీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్నికల అధికారి శ్రీరాములు అవగాహన కల్పించారు.
7
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల


