23,750 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంసాగు
నరసరావుపేట రూరల్: జిల్లాలో ఈ ఏడాది 23,750 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలు చేసినట్టు డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. జాతీయ సహజ వ్యవసాయ మిషన్‌లో భాగంగా బృందావనం సమావేశ మందిరంలో ఇంటర్నల్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్‌కు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అమలకుమారి మాట్లాడుతూ జిల్లాను 125 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లలో 125 ఎకరాలు చొప్పున రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించుకుండా ఈ ఏడాది సాగుచేసినట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో భూమిలో కర్భన శాతం పెరిగి పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని తెలిపారు. నీటి కాలుష్యం తగ్గడంతో పాటు బోరు ఆధారిత వ్యవసాయంలో కరెంటు వినియోగం కూడా తగ్గుతుందని వివరించారు. రైతులకు ట్రేసబిలిటీ క్యూఆర్ కోడ్‌తో కూడిన సర్టిఫికేట్ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


