తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా టీటీడీ నిత్యాన్నదానానికి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు గురువారం తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఒక రోజు అన్నదాన నిమిత్తం ఈ విరాళాన్ని అందించామని తెలిపారు.
రొంపిచర్ల: స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం కనపడింది. ఉదయం వేళ గర్భగుడిలో ఉన్న అమ్మవారి మూలవిరాట్‌ను తాకుతూ సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వచ్చారు. పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు వేముల బాబు శర్మ పర్యవేక్షించారు.
నరసరావుపేట రూరల్: వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం కోటప్పకొండ క్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నాదెండ్ల: గణపవరం శ్రీ కెల్లంపల్లి భద్రాచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి ఇరువురు దాతలు రూ.1.05 లక్షల విరాళాన్ని హెచ్‌ఎం కృష్ణానాయక్‌కు అందించారు. గ్రామానికి చెందిన జంపని శ్రీనివాసరావు, కాట్రు కృష్ణారావు గురువారం పాఠశాలను సందర్శించి, విరాళం అందజేశారు. పాఠశాల పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ప్రహరీ, ప్రార్థన వేదిక, ఓపెన్ ఆడిటోరియం, తదితర నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని రైల్వే గేటును తాత్కాలికంగా మూసివేయనున్నట్లు రైల్వే అధికారి కన్నబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు అత్యవసర రహదారి పనుల నిమిత్తం అంజిరెడ్డి కాలనీ, కేసీసీ యార్డ్ మధ్య గల రైల్వే గేటు మీదుగా రాకపోకలను నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.
తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం
తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం
తిరుమల అన్నప్రసాదానికి రూ.44 లక్షలు విరాళం


